Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అటవీ అధికారులను అడ్డుకుంటున్న ఆదివాసీలు

అటవీ అధికారులను అడ్డుకుంటున్న ఆదివాసీలు

కోటపల్లి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : మం డలంలో పట్టు పురుగుల పెంపకం అటు ఆది వాసీలకు, ఇటు అటవీ అధికారులకు మధ్య మరోసారి వివాదానికి తెరలేపింది. మండ లంలోని కావరకొత్తపల్లి అటవీ ప్రాంతంలో పట్టు పురుగులను పెంచవద్దని పట్టుపురు గుల పెంపకం నిషేధం అంటూ శనివారం అ టవీ శాఖ అధికారులు పట్టు పంటను నాశ నం చేయడంతో పాటు పట్టు పురుగులను కింద పడేయడంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు.

గత సంవత్సరం సైతం ఇలాంటి ప రిస్థితే ఎదురు కాగా దీనిపై ఆందోళనలు చె లరేగాయి. మరో మారు అటవీ అధికారులు పట్టు పురుగులను పెంచవద్దని అటవీ ప్రాం తానికి ఎవరు రావద్దంటూ నల్లమద్ది చెట్లపై ఉన్న పట్టు పురుగులను చెట్ల మండలను వి రిచి పడేశారు. దీంతో ఆదివాసీలు అటవీ అధి కారులను అడ్డుకున్నారు. రెండు సంవత్స రా లుగా ఆదివాసీలకు అడ్డం తగులుతూ అటవీ అధికారులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేక శేఖర్‌ అ న్నారు. అడవిని నాశనం చేయడం కానీ, పో డు వ్యవసాయ కానీ చేయడం లేదని అటవీ చట్టానికి అనుగుణంగానే చెట్లపైన పట్టు పు రుగులను పెంచుతూ జీవనాధారం సాగిం చే ఆదివాసీలపై అటవీ అధికారులు దాడులు చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని, ప్రభు త్వం స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy