ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెటిక్స్ జట్టు ఎట్టకేలకు స్వర్ణ పతకం సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో కిరణ్ పహల్, ఎం.ఆర్. పూవమ్మ, ప్రాచి, విథ్యా రామ్‌రాజ్‌తో కూడిన భారత బృందం అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్ 3:29.69 నిమిషాల్లో రేసును పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది (India athletics gold).
రేసులో భారత్‌కు చివరి ల్యాప్ అత్యంత కీలకంగా మారింది. చివరి దశలో బహ్రెయిన్ నుంచి సల్వా ఈద్ నాసర్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే యాంకర్‌గా బరిలోకి దిగిన విథ్యా రామ్‌రాజ్ ఒత్తిడిని అధిగమించి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దీంతో భారత బృందం స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. భారత్ 3:29.69 నిమిషాల్లో రేసు పూర్తి చేయగా.. బహ్రెయిన్ 3:30.21తో రజతం, చైనా 3:31.02తో కాంస్యం సాధించాయి. బహ్రెయిన్‌పై భారత్ 0.52 సెకన్ల ఆధిక్యంతో గెలిచింది (4x400m relay, women's relay).
2026 ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ బృందానికి మహిళల 4x400 మీటర్ల రిలే స్వర్ణం ప్రత్యేకంగా నిలిచింది. ఈ విజయం ద్వారా ఈ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని అందుకుంది. విథ్యా రామ్‌రాజ్ (Vithya Ramraj)కు నాగోయా ఏషియన్ గేమ్స్‌లో ఇది మరో పతకం. అంతకుముందు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె కాంస్య పతకం సాధించింది. ఆ రేసులో 54.75 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో పరుగెత్తి పి.టీ. ఉష పేరిట 42 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.
ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్
సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా

