Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అటుకుల ప్రసాదాలు...

అటుకుల ప్రసాదాలు...

కృష్ణాష్టమి పండుగ రోజున అటుకులతో ప్రత్యేకంగా తయారుచేసే ప్రసాదాల గురించి తెలుసుకుందాం

ముందుగా వెడల్పాటి గిన్నెలో ఓ కప్పు అటుకులను తీసుకుని మంచినీటితో శుభ్రంగా కడగాలి.

తరువాత ఓ పది నిమిషాలు అలాగే ఉంచితే అటుకులు తడిని పీల్చుకుని మెత్తగా పొడిపొడిగా తయారవుతాయి.

  • ఒక పళ్లెంలో అర కప్పు నానిన అటుకులు, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుం, పావు చెంచా యాలకుల పొడి, పావు కప్పు బెల్లం తురుం, రెండు చెంచాల నెయ్యి వేసి చేత్తో మెత్తగా కలిపి పైన రెండు తులసి ఆకులు ఉంచాలి. దీన్నిపంచకజ్జాయం అంటారు.

  • మరో పళ్లెంలో.. మిగిలిన అటుకులు, పావు కప్పు కీర ముక్కలు, పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, చెంచా పచ్చి మిర్చి తరుగు, కొన్ని దానిమ్మ గింజలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, అర కప్పు చిక్కటి తాజా పెరుగు వేసి చెంచాతో బాగా కలిపి పైన తులసి ఆకులు ఉంచాలి. దీన్ని గోపాల్‌ కాలా అంటారు.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి రెండు చెంచాల నెయ్యి, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. తరువాత అదే గిన్నెలో కప్పు అటుకులు వేసి చిన్న మంటమీద అయిదు నిమిషాలు వేయించి పళ్లెంలోకి తీయాలి. అదే గిన్నెలో అర కప్పు పచ్చి కొబ్బరి తురుం వేసి పొడిపొడిగా వేయించాలి. మిక్సీలో.. ముందుగా వేయించిన అటుకులు, ఇరవై జీడిపప్పులు, రెండు యాలకులు వేసి గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి కప్పు బెల్లం తురుం వేసి అర కప్పు నీటిని పోసి మరిగించాలి. ఆపైన వేయించిన కొబ్బరి తురుం, అటుకుల పొడి, కొద్దిగా పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి దగ్గరకు వచ్చిన తరువాత స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత లడ్డూలు చేసి ఒక్కోదానిపై వేయించిన జీడిపప్పును పెట్టాలి. అంతే! అటుకుల లడ్డూ రెడీ!

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy