Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్

అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్

హైదరాబాద్, ఆగస్టు 27: భాగ్యనగరంలో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఈరోజు(గురువారం) తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలయ్యాయి. భూపాలపల్లితో పాటు హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు ప్రాంతాల్లోని 8 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి.

సోదాల్లో జయరాజ్ ఇంట్లో లక్షన్నర నగదు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోడుప్పల్‌లో జీ ప్లస్ వన్ బిల్డింగ్, ల్యాండ్ డాక్యుమెంట్లను గుర్తించి.. పరిశీలిస్తున్నారు. బ్యాంకులో రూ.60 లక్షల నగదు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే రెండు కార్లు, రెండు బైక్‌లు, జనగామలో ఐదు ఎకరాల భూమి ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది.

భారీగా బంగారాన్ని గుర్తించాం: ఏసీబీ జాయింట్ డైరెక్టర్

సోదాలపై ఏబీసీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. భూగర్భ జల గనుల శాఖ ఏడీ జయరాజు నివాసంలో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో నలభై తులాల బంగారాన్ని గుర్తించామన్నారు. జయరాజ్ ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు ఆయన బ్యాంకు ఖాతాలో నగదును కూడా గుర్తించామని చెప్పారు. జనగామలో జయరాజుకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని.. ఆయనపై ఏసీబీకి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. హైదరాబాద్‌లోనే నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని సాయి మనోహర్ తెలిపారు. తాండూరు, వరంగల్‌లోని జయరాజ్ సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయని అన్నారు. బోడుప్పల్‌లో జీ ప్లస్ వన్ బిల్డింగ్‌తో పాటు రెండు కార్లు, రెండు బైక్‌లను కూడా గుర్తించామన్నారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగుతాయని.. సోదాల అనంతరం ఆయన అక్రమాస్తులపై క్లారిటీ వస్తుందని ఏబీసీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ వెల్లడించారు.

చిలకలూరిపేట ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి..

అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy