Dailyhunt
అయోధ్యకు బయలుదేరిన ప్రధాని మోదీ

అయోధ్యకు బయలుదేరిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయానికి భూమి పూజ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక జెట్ విమానంలో లక్నోకు బయలుదేరారు. పట్టుపంచె, పొడగు కుర్తా ధరించిన మోదీ మెడలో పట్టువస్త్రాన్ని వేసుకున్నారు. సంప్రదాయబద్ధ వస్త్రధారణలో మోదీ లక్నో నుంచి హెలికాప్టరులో బయలుదేరి అయోధ్యలోని సాకేత్ కళాశాల హెలిప్యాడ్ లో దిగనున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ లో రామాలయం భూమి పూజా స్థలానికి చేరుకుంటారు. భూమి పూజ సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామమందిర ట్రస్టు చీఫ్ నృత్య గోపాల్ దాస్, యూపీ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు వేదికను పంచుకోనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy