అయోధ్య : ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో శనివారం నిర్వహించవలసిన రామ్ బరాత్‌ను రద్దు చేశారు. సాధువులతో చర్చించి, ధర్మ యాత్ర మహా సంఘం, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
వీహెచ్‌పీ అధికార ప్రతినిథి శరద్ శర్మ మాట్లాడుతూ, సాధువులతో సంప్రదించి, శ్రీరాముని పెళ్లి ఊరేగింపు (రామ్ బరాత్)ను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ సంబరాలను భక్తులు తమ ఇళ్ళ వద్దనే జరుపుకోవాలని తాము కోరుతున్నామన్నారు. జెండాను ఎగురవేసి, మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించాలని, శంఖం పూరించాలని, పవిత్రమైన మంత్రాలను పఠించాలని కోరుతున్నామన్నారు.
అయోధ్యలోని వివిధ దేవాలయాల నుంచి రామ్ బరాత్ జరుగుతుంది.

