Dailyhunt

అయోధ్యలో స్థలం కోసం లేఖ రాయండి

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ సూచన

మంగళ్‌హాట్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయితే రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లే అవకాశం ఉందని, అక్కడ వసతి సౌకర్యం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ సూచించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మేరకు వినతులు పంపారని పేర్కొన్నారు. తాము కూడా యూపీ సీఎంతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. దీనిపై వెంటనే స్పందించాలని సీఎం కేసీఆర్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy