నిర్మల్ జిల్లా, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని మహంకాళి ఆలయంలో జరిగిన చోరీ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉన్నతాధికారులు, నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.
హోంగార్డుల సస్పెండ్..
మరోవైపు ఆలయ భద్రతలో అలసత్వం వహించిన వారిపై ఆలయ యంత్రాంగం కఠిన చర్యలు ప్రారంభించింది. బాసర ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు హోంగార్డులను ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనీదేవి సస్పెండ్ చేశారు.
ఎస్పీకి ఈవో లేఖ..
ఆలయంలో చోరీ జరిగిన సమయంలో లేదా విధుల్లో ఉన్న సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, బాధ్యతారహితంగా విధులకు గైర్హాజరైన హోంగార్డులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నిర్మల్ జిల్లా ఎస్పీకి ఈవో అంజనీదేవి లేఖ రాశారు. ఆలయ భద్రతా లోపాలు, సిబ్బంది గైర్హాజరుపై నిఘా పెట్టిన పోలీసులు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి.
.

