జాతీయం-అంతర్జాతీయం
బడ్జెట్... రూ. 80 వేల వరకు ఉపశమనం ?

న్యూఢిల్లీ : కరోనా నేపధ్యంలో రానున్న కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు ఊరటనివ్వడంతో పాటు డిమాండ్ పెంచడం కోసం స్పెండింగ్స్ ప్రోత్సాహ పథకాలు, ప్రకటనలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు లాక్‌డౌన్ విధించగా, ఆ తర్వాత క్రమంగా సడలింపులనిస్తూ వచ్చారు. ఈ క్రమంలో... నాలుగైదు నెలలుగా ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
కేంద్రం ఇప్పటికే రూ. 30 వేల కోట్ల ప్యాకేజీనిచి్చిన విషయం తెలిసిందే. కాగా... రానున్న బడ్జెట్‌లో... ఖర్చుకు ప్రోత్సాహమిచ్చి, డిమాండ్ పెంచేలా నిర్ణయాలు వెలువడవచ్చునని భావిస్తున్నారు. కాగా... ఆదాయ పన్ను చెల్లింపుదారులకు పన్ను లయబిలిటీలో రూ. 50 వేల నుండి రూ. 80 వేల మధ్య ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. పాత ఆదాయ పన్నుకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్ తగ్గింపును పెంచే అవకాశముందని చెబుతున్నారు.
ఇక... పొదుపును ప్రోత్సహించేందుకు 2020 బడ్జెట్‌లో మూడు ఆదాయ పన్ను స్లాబ్స్‌ను చేర్చారు. కాగా... ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. లక్ష వరకు పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విజ్ఞప్తి చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపధ్యంలో ప్రామాణిక తగ్గింపు పరిమితిని పెంచాల్సి ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కూడా సూచించింది.