ముంబై : కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. నేడు సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయింది. గత గురువారం 50 వేల పాయింట్లను తాకిన సెన్సెక్స్ ఆ తర్వాత నుండి కుప్పకూలుతూ వస్తోంది.
నాలుగు సెషన్లుగా మార్కెట్లు తీవ్ర వష్టాల్లో ముగియడం లేదా కొనసాగడం జరుగుతోనన విషయం తెలిసిందే. గతవారం 50 వేల మార్కు్ దాటిన సెన్సెక్స్ ఇప్పుడు 47,800 దిగువకు పడిపోయింది. నిఫ్టీ గతవారం 14,750 నుండి 14,100 పాయింట్ల దిగువకు చేరుకుంది.

