Dailyhunt
బైడెన్‌కు మూడు పేజీల లేఖ రాసిన బ్రెజిల్ అధ్యక్షుడు

బైడెన్‌కు మూడు పేజీల లేఖ రాసిన బ్రెజిల్ అధ్యక్షుడు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ఆయనకు మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో మొదటగా బైడెన్‌కు అభినందనలు తెలిపిన ఆయన.. అనంతరం ఇరు దేశాలపై గతంలో కుదరిన ఒప్పందాల గురించి ప్రస్తావించారు. స్వేచ్ఛా వాణిజ్యంపై ఇరు దేశాల మధ్య గతంలో ఒప్పందం కుదిరినట్టు గుర్తించారు. బైడెన్ హయాంలో కూడా అది కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా.. ట్రంప్‌తో సత్సంబంధాలు కొనసాగించిన బోల్సొనారో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించారు. ఈ క్రమంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో.. బైడెన్ విజయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy