Friday, 24 Sep, 4.30 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
బస్సు, కరెంటు చార్జీలు పెంచితే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం

సిరిసిల్ల, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): బస్సు, కరెంటు చార్జీలు పెంచితే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రభు త్వం వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ అప్పులపాలైందనే వంకతో ఆ సంస్థ ఆస్తులను అమ్ముకోవడానికి.. ఆర్టీసీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌ల ఏర్పాటుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చమురు సంస్థలు పెట్రోల్‌ ధరలను పెంచుతున్నా.. అం దులో లీటరుకు రూ. 40 రాష్ట్రాలకు వస్తాయని గుర్తుచే స్తూ.. దేశంలోనే జీడీపీలో తెలంగాణ టాప్‌ అని చెబుతు న్న ముఖ్యమంత్రి పెట్రోల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. గురువారం ప్రజాసంగ్రామ యాత్ర 27వ రోజు రాజన్న-సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం డలం నర్మాల ప్రాజెక్ట్‌ నుంచి మొదలైంది. గంభీరావుపేట, లింగన్నపేట సభల్లో బండి సంజయ్‌ మాట్లాడు తూ వ్యవసాయంపై సీఎం నిర్ణయాలను తీవ్రంగా విమర్వించారు. ''వరి.. ఉరి.. అంటూ రైతులను ముఖ్యమంత్రి బెదిరిస్తున్నడు. కేంద్రం బియ్యం కొనదని మోదీ ఫోన్‌ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాడా..? పండించిన ప్రతిగింజ మేమే కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ తంలో అన్నారు.

కేంద్రం పెత్తనమని ఏందన్నారు. ఇప్పు డు కేంద్రం కొంటలేదనంటున్నారు. కేంద్రానికి, బియ్యాని కి సంబంధం ఉందా?'' అని ప్రశ్నించారు. రైతులు ఎవ రూ బాధపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ధా న్యాన్ని కొనాలని అన్నారు. ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాళేశ్వరం జలాలతో కోటి ఎకరాలకు సాగునీరిస్తామన్నప్పుడు పంట దిగుబడి పెరుగుతుంద ని తెలియదా.. దేనికోసం వరి ఉరి అని బెదిరిస్తున్నారని నిలదీశారు. ''ప్రణాళికలు, అంచనాలు ఏమయ్యాయి? పంట మార్పిడిని వ్యతిరేకించడం లేదు. ఏ భూమిలో ఏ పంట వేయాలో భూసార పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అనే అడుగుతున్నా. ఇందుకోసం రూ.120 కోట్లు కేంద్రం ఇచ్చింది'' అని గుర్తుచేశారు. సీఎం ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడతారని, దొడ్డు వడ్లు వద్దేవద్దు స న్నాలే సాగు చేయాలని.. మక్కలు వద్దని మరోసారి.. ఇలా చెప్పిన సీఎం.. ఇప్పుడు వరి ఉరి అంటున్నారని ఆ రోపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పేరుతో త న బినామీల నుంచి అడ్డగోలు రేట్లకు కరెంటు కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్తు ఇచ్చి, రైతుల ఇళ్లలో కరెంట్‌ చార్జీలను పెంచుతున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా దళితబంధు అమలుతోపాటు నేతన్నలకు, బీసీ, బడుగు బలహీనవర్గాలకు కులాల వారీగా బంధు పథకాలని అమలు చేయాలని.. లేనిపక్షంలో అక్టోబరు 2 నుంచి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని అ న్నారు. 1,400 మంది చేసిన త్యా గాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు ఒక్క కుటుంబమే రాజ్యమేలుతోందని విమర్శించారు. గడీల పాలనను బద్ధలు కొట్టి, గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఉద్ఘాటించారు. ''బీజేపీ కార్యకర్తలను కేసుల పేరుతో బెదిరిస్తున్నారు. అనవసరంగా అరెస్టు చేస్తే.. నే నే ఠాణాకు వెళ్తా. అప్పుడు ముఖ్యమంత్రే రావాల్సి వ స్తుంది'' అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇతర మతాల పండుగలకు అనుమతులు అక్కర్లేదని, హిందూ పండుగలకే పోలీసు, రెవెన్యూ, మునిసిపల్‌, గ్రామపంచాయతీ, పీసీబీ అనుమతులు తీసుకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణలో సర్పంచులు ఆస్తులను అమ్ముకునే లా, ఎంపీటీసీలు పేరుకే ఉన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయన్నారు. సీఎం నియోజకవర్గంలో 20 మంది సర్పంచులు రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. ఏకగ్రీవ పంచాయతీలకు ఇంకా ప్రోత్సాహకాలే అందలేదన్నారు. సిరిసిల్ల మాఫియా అడ్డాగా మారిందని, ఈ ప్రాంతానికి మంత్రి కేటీఆర్‌ ఏం చేశాడని ప్రశ్నించారు.

4 లేదా 5న ఢిల్లీకి సంజయ్‌!

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వచ్చేనెల 4న లేదా 5న ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల, మరికొందరు పార్టీ జాతీయ ముఖ్యులతో సమావేశం కానున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

మంత్రి కేటీఆర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే సవాల్‌

గతంలో ప్రభుత్వాలు పేదలకు, దళితులకు ఇచ్చిన భూములను లాక్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత లాక్కొన్న భూములు, ఇచ్చిన భూములపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి కేటీఆర్‌కు సవాలు విసిరారు. రాజన్న-సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి వద్ద వంద ఎకరాలకు పైగా దళితుల భూములను ప్రభుత్వం లాక్కుందని విమర్శించా రు. ''రామన్నా.. అసెంబ్లీకి వస్తున్నాం..! దమ్ముంటే దళితుల భూములపై చర్చకు రావాలి. ఒకరోజు దళితుల భూములు.. మరోరోజు పోడు భూములు.. ఇంకోరోజు నిరుద్యోగుల సమస్య.. ఇలా పదిరోజులు అసెంబ్లీ పెట్టాలి'' అని డిమాండ్‌ చేశారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ సోషల్‌మీడియాలో హీరో అని.. క్షేత్రస్థాయిలో జీరో అని విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top