Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బత్తాయి ఎగుమతులకు ఇబ్బంది లేదు- మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్గొండ: బత్తాయి, నిమ్మ ఎగుమతలుకు ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండబోదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. జాతీయంగా సరుకులు,పంటదిగుబడులు రవాణా చేసి వాహనాల మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేసిన క్రమంలో బత్తాయి, నిమ్మ రైతులు నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చని ఆయన చెప్పారు. శనివారం నల్గొండ కలెక్టర్‌ కార్యాలయంలో బత్తాయి, నిమ్మ పంటలతో పాటు జిల్లాలో అఽధిక దిగుబడి ఉన్న పుచ్చకాయ పంటపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లా ఉద్యానవన ,పట్టు పరిశ్రమల అధికారిణి సంగీతలక్ష్మి జిల్లాలో బత్తాయి, నిమ్మతో పాటు పుచ్చకాయల దిగుబడిని వివరించారు. చేతికి వచ్చిన పంట రవాణా సౌకర్యం లేక పోవడంతో రైతాంగం గాబరా పడుతున్నారని ఆమె మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి మంత్రి జగదీశ్‌రెడ్డి పై విధంగా స్పందించారు. మొత్తం జిల్లాలో 46వేల 800 ఎకరాల్లో బత్తాయి తోటలు విస్తరించి ఉండగా అందులో 30వేల ఎకరాలపై చిలుకు బత్తాయి కాపుకొచ్చిందనారు..

మొత్తం మీద ఈ సీజన్‌లో ఒక్కబత్తాయి 43వేల మెట్రిక్‌టన్నుల దిగుబడి వస్తుందన్న అంచనా వేశామని ఆమె మంత్రి తెలిపారు. అదే విధంగా 16వేల ఎకరాల విస్తీర్ణంలో వేసిన నిమ్మ ఇప్పటికే 8,800 ఎకరాల్లో సాగు వచ్చిందన్నారు. 52 వేల 400 మెట్రిక్‌ నిమ్మ పంటతో పాటు 5,300 ఎకరాల విస్తీర్ణంలో వేసిన పుచ్చకాయ దాదాపు లక్షకు పైగా చిలుకు మెట్రిక్‌టన్నులపంట దిగుబడికి సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలోని బత్తాయి, నిమ్మ , పుచ్చకాయ పంటను ఇక్కడి రైతాంగం ట్రేడర్స్‌ ద్వారా హైదరాబాద్‌, ఢిల్లీలలో పాటు గుజరాత్‌కు ఎగుమతి చేసేవారని అయితే కరోనా వైరస్‌తో ఏర్పడ్డ పరిస్థితులు రవాణా రంగం పై చూపడంతో రైతుల్లో ఆందోళన మొదలైందని సంగీత లక్ష్మి వివరించారు. అయితే జాతీయంగా ఈ తరహా ఎగుమతులు చేసే వాహనాలపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేసినందున ఎలాంటి ఇబ్బంది ఉండబోదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy