Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..

బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..

ఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బయో టెర్రరిజం కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు (NIA) కీలక ముందడుగు వేశారు.

బహిరంగ ప్రదేశాల్లో విషప్రయోగం ద్వారా అమాయక ప్రజలను చంపాలని ప్లాన్ చేసిన నిందితులపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

నిందితులు ఎవరు?..

ఈ కేసులో ప్రధానంగా ముగ్గురిపై ఎన్ఐఏ అధికారులు అభియోగాలను మోపారు. వీరిలో డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌, అమ్జత్‌తో సహా ముగ్గురిపై ఎన్ఐఏ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొహియుద్దీన్‌ చైనాలో వైద్య విద్య (MBBS) అభ్యసించాడు. తనకున్న వైద్య పరిజ్ఞానాన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడాలని అతడు ప్లాన్ చేశాడని అధికారులు తెలిపారు.

'రైసిన్'తో విషప్రయోగం..

బహిరంగ ప్రదేశాల్లో విషప్రయోగం చేసేందుకు నిందితులు కుట్ర చేశారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. గుజరాత్‌లో మొదట అమలు చేసే విధంగా నిందితులు ప్లాన్ చేశారు. రైసిన్ ద్వారా విషప్రయోగానికి కుట్ర చేశారు. ప్రముఖ ఆలయాలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. గాలి, ఆహారం, నీటి ద్వారా ఈ విషాన్ని ప్రయోగించి భారీ ప్రాణనష్టం కలిగించాలనేది వీరి ప్లాన్ అని అధికారుల దర్యాప్తులో తేలింది.

గుజరాత్‌లో మొదటగా ప్లాన్..

వారి ప్లాన్‌లో భాగంగానే గత ఏడాది నవంబర్ 7వ తేదీన వీరు గుజరాత్‌లో సంచరిస్తుండగా, అహ్మదాబాద్ సమీపంలోని అదాలత్ టోల్ ప్లాజా వద్ద గుజరాత్ ఏటీఎస్ (ATS) అధికారులు వీరిని పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎన్ఐఏకు అప్పగించారు. డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ చైనాలో చదువుకున్న సమయంలోనే తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు అనుమానిస్తున్నారు. ఈ కుట్ర వెనుక విదేశీ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా అనే కోణంలోనూ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఛార్జ్‌షీట్ దాఖలుతో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి 'బయో టెర్రర్' కుట్ర బయటపడటంతో భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy