Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెడ్ పట్టుకుని నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే

బెడ్ పట్టుకుని నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే

బెంగళూరు: కర్నాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో బెంగళూరులో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. ఆక్సిజన్ అందక.. బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. చామరాజనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల మృతి చెందిన కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని మాజీ శాసనసభ్యుడు వాటాళ్ నాగరాజు డిమాండ్ చేశారు. 24 మంది మృతికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉందన్నారు. దీంతో బెడ్ పట్టుకుని ఆయన నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరిచి ఉత్తమ చికిత్స అందించాలన్నారు.

కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నాగరాజు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy