సిద్దిపేట: దేశంలోనే బెస్ట్ కాలనీగా తునికి బొల్లారం R & R కాలనీని తీర్చిదిద్దామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. కొండపోచమ్మ సాగర్ జలాశయం నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన తునికి బొల్లారం R & R కాలనీని కలెక్టర్ వెంకట్రాం రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. తునికి బొల్లారం R & R కాలనీ వివరాలను సీఎస్ సోమేష్ కుమార్‌కు కలెక్టర్ వెంకట్రాం రెడ్డి వివరించారు. అనంతరం నిర్వాసితులతో సీఎస్ మాట్లాడారు. R & R కాలనీ చాలా బాగా వచ్చిందని సీఎస్ అన్నారు.
కాలనీ లే అవుట్, అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో దేశంలోనే బెస్ట్ కాలనీగా తునికి బొల్లారం R & R కాలనీగా ఉందన్నారు.

