Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెయిల్‌పై వచ్చి.. బెంబేలెత్తించి..

బెయిల్‌పై వచ్చి.. బెంబేలెత్తించి..

  • రౌడీషీటర్‌తో పాటు మరో ఇద్దరి అరెస్టు

రాజాం రూరల్‌, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): గతనెల 27న రాజాం పొలీసులు అరెస్టు చేసిన రౌడీషీటర్‌ బెయిల్‌పై వచ్చి తన నేర ప్రవృత్తిని కొనసాగించడం ప్రారంభించాడు.

అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు రౌడీషీటర్‌ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసుపై గురువారం రాజాం టౌన్‌ సర్కిల్‌ కార్యాల యంలో ఎస్‌ఐ సల్మాన్‌ బేగ్‌తో కలిసి సీఐ డి.నవీన్‌కుమార్‌ వెల్లడించిన వివ రాలి లా ఉన్నాయి. రాజాం పొలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇప్పటికే 11 కేసులున్న పట్టణా నికి చెందిన రౌడీషీటర్‌ సిరిపురపు దేవరాజ్‌ అలియాస్‌ దేవాను గతనెల 27న రాజాం సీఐ నవీన్‌కుమార్‌ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల తర్వాత బెయిల్‌పై వచ్చారు.

ఎప్పటిలాగే తన ప్రవృత్తిని కొనసాగించాడు. గోపా లపురం గ్రామానికి చెందిన ఎం.శేఖర్‌బాబు ఈనెల 26న రాత్రి రాజాంలో పనులు ముగిం చుకుని స్వగ్రామం వెళ్తుండగా.. మార్గమధ్యమంలో దేవరాజ్‌.. పెనుబాక గ్రామా నికి చెందిన బోనెల దుర్గాప్రసాద్‌, బోనెల దిలీప్‌కుమార్‌లతో కలిసి అడ్డుకున్నారు.

డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తన వద్ద డబ్బుల్లేవని శేఖర్‌ బాబు చెప్పి నా వినలేదు. డబ్బులు, ద్విచక్ర వాహనం ఇవ్వకపోతే చంపేస్తామని ఆ ము గ్గురూ శేఖర్‌బాబును బెదిరించారు. అయినాసరే తన వద్ద డబ్బుల్లేవని గట్టిగా చెప్పడంతో శేఖర్‌బాబు జేబులోని వెయ్యి రూపాయలను బలవంతంగా లాక్కొని, అతని ద్విచక్ర వాహనాన్ని కూడా లాక్కొని అక్కడి నుంచి పరార య్యారు.

ఎవరికైనా చెప్తే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో శేఖర్‌బాబు భయ పడి పొలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి చేరుకున్నారు. అనంతరం గ్రామస్థుల సహకారంతో గురువారం రాజాం సీఐ నవీన్‌కుమార్‌కు వివరించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ సల్మాన్‌ బేగ్‌ కేసు నమోదుచేసి ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు. రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు. ఎవరైనా బెదిరించినా, నగదు, వస్తువులు ఇవ్వాలని డిమాండ్‌ చేసినా ఽధైర్యంగా పొలీసులకు సమాచారం ఇవ్వాలని రాజాం టౌన్‌ సీఐ నవీన్‌కుమార్‌ ప్రజలు, వ్యాపారస్తులకు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy