Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మళ్లీ బ్యాట్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగక్కర..

తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న విలేజ్ క్రికెట్ టోర్నీలో మైదానంలోకి దిగాడు. షిల్లింగ్‌స్టోన్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు సంగక్కర ధరించిన హెల్మెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు సంగక్కర కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. గురు దక్షిణగా బీసీసీఐ లోగోతో పాటు జాతీయ జెండా ఉన్న ఆ హెల్మెట్‌ను సంగక్కరకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని ధరించి బరిలోకి దిగడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సంగక్కర భారత హెల్మెట్‌తో ఆడిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో 48 ఏళ్ల సంగక్కర.. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం అనుభవమే కాదు, ఇంకా తన బ్యాటింగ్‌లో పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అతడు 168 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 16 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండగా మొత్తం 130 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. తన ఇన్నింగ్స్‌తో పాటు భారత హెల్మెట్ ధరించడంతో సంగక్కర నెట్టింట వైరల్‌గా మారాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy