Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌కు బీ777 విమానం

భారత్‌కు బీ777 విమానం

వీవీఐపీల ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపకల్పన

న్యూఢిల్లీ, అక్టోబరు 1: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాలకు మాత్రమే ఉపయోగించే బీ777 ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. అమెరికాలోని టెక్సస్‌ నుంచి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారు జాము 3 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్టు అధికారులు చెప్పారు. ఎయిర్‌ ఇండియా కోసం బోయింగ్‌ సంస్థ తయారుచేసే ఈ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఈ ఏడాది జూలైలోనే మనదేశానికి రావాల్సి ఉంది. కరోనా వ్యాప్తి, సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. వీవీఐపీ టూర్లకు ఉపయోగించే మరో బీ777 విమానం కూడా త్వరలో మన దేశానికి రానుందని అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాల కొనుగోలు కోసం రూ.8,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్పారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ఇప్పటి వరకు బీ747 విమానాల్లో మాత్రమే ప్రయాణించేవారు. బీ777 విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే బీ 747 విమానాలను వాణిజ్యపరమైన అవసరాలకు మాత్రమే వినియోగిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy