Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

ఇంటర్నెట్ డెస్క్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా వంద శాతం సుంకాలు విధించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సుంకాల సమస్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పరిష్కరించుకుంటారని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు.

ఇరువురు నేతల మధ్య మంచి బంధం ఉందని ఆయన పేర్కొన్నారు (Trump Modi Russian Oil).

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేసే ఐదు దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారం కల్పించే బిల్లును అమెరికా సెనేట్ ఇటీవల ఆమోదించింది. రష్యా చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతున్నాయన్నది అమెరికా వాదన. రష్యా నుంచి భారత్ ప్రస్తుతం భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది (India US Tariff Dispute).

రష్యా చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్‌పై అమెరికా విధించనున్న సుంకాల గురించి అడిగిన ప్రశ్నకు నవారో స్పందించారు (Russian Oil Trade). ఈ అంశాన్ని ట్రంప్, మోదీ స్వయంగా చర్చించి పరిష్కరించుకుంటారని చెప్పారు. ఇరువురి మధ్య మంచి సంబంధాలు ఉన్నందున ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

ప్రయోగించిన 85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy