Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌పై విజయం.. మా స్థాయిని పెంచింది: ఐర్లాండ్ క్రికెట్ చీఫ్

భారత్‌పై విజయం.. మా స్థాయిని పెంచింది: ఐర్లాండ్ క్రికెట్ చీఫ్

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టును ఐర్లాండ్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం చేపట్టిన తర్వాత ఆడిన తొలి సిరీస్‌లోనే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

అయితే భారత్ వంటి ప్రపంచ ఛాంపియన్ జట్టుపై చారిత్రక టీ20 సిరీస్ విజయం ఐర్లాండ్ క్రికెట్ ప్రతిష్ఠను పెంచిందని ఆ దేశ బోర్డు అధ్యక్షుడు బ్రయాన్ ఓడొన్నెల్ పేర్కొన్నారు. ఇప్పటి నుంచి ఐర్లాండ్‌ను ప్రపంచ క్రికెట్‌లో మరింత గౌరవంగా చూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

'ఈ విజయం మాపై ప్రభావం చూపుతోంది. మా ప్లేయర్లకు భారత్‌పై గెలుపు భారీ ప్రోత్సాహంగా మారింది. దీంతో వారు ఇతర లీగ్‌లు, అవకాశాలకు కూడా చేరువవుతారు. ఇప్పటి వరకు ఐర్లాండ్ క్రికెట్ జట్టు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ టీమిండియాను ఓడించిన తర్వాత మమ్మల్ని చూసే దృక్కోణం కూడా మారుతుంది. త్వరలోనే ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఐర్లాండ్ క్రికెట్ అభివృద్ధికి దోహదపడుతుంది. స్టీవ్ వా, రాహుల్ ద్రవిడ్, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. వారి అనుభవం ఐర్లాండ్ ప్లేయర్లకు ఉపయోగపడుతుంది' అని బ్రయాన్ వెల్లడించారు.

అదే మాకు అడ్డంకిగా ఉంది..

భారత్‌తో టీ20 సిరీస్‌ విజయంలో ఐర్లాండ్ బౌలర్ జై మూన్‌డ్రా కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు భారత సంతతి ప్లేయర్ కావడం విశేషం. ఈ విషయంపై కూడా బ్రయాన్ స్పందించారు. 'ప్రతిభ ఉన్న ప్లేయర్లకు అవకాశం ఇవ్వడానికి మా బోర్డు సిద్ధంగా ఉంటుంది. అయితే టెస్టు క్రికెట్ విషయంలోనే నాకు ఆందోళన. ఆ ఫార్మాట్‌లో ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇది ఐర్లాండ్ క్రికెట్ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. ఇప్పటివరకు ఐర్లాండ్ కేవలం 13 టెస్టులు ఆడింది. అందులో 3 విజయాలు మాత్రమే సాధించింది. భవిష్యత్తులో మరిన్ని టెస్టు మ్యాచ్‌లు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. అవసరమైతే దేశీయ ఫస్ట్ క్లాస్ టోర్నీని తిరిగి ప్రారంభిస్తాం' అని బ్రయాన్ వెల్లడించారు.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోను.. రిటైర్‌మెంట్‌పై రొనాల్డో క్లారిటీ

ఐర్లాండ్ సిరీస్‌లోనే వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సింది: ఏబీ డివిలియర్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy