Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్-శ్రీలంక రెండో టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట

భారత్-శ్రీలంక రెండో టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట

ఇంటర్నెట్ డెస్క్: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వర్షం అంతరాయం కలిగించడంతో ముందే ఆటను నిలిపేయాల్సి వచ్చింది.

మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఫాలో ఆన్‌లో శ్రీలంక స్కోర్ 229/6. క్రీజులో కేషారా నువాంత(3*), సోనాల్ దినుశా(7*) కొనసాగుతున్నారు. భారత్ కంటే శ్రీలంక 16 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఓవర్‌నైట్ 265/8 స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. మరో 25 పరుగులు జోడించి 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో లంకతో భారత్ ఫాలో ఆన్ ఆడించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 503/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 2, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, సారాంశ్ జైన్, జడేజా తలొక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయావకాశాలు వాతావరణంపై ఆధారపడి ఉన్నాయి. గురువారం వరుణుడు కరుణించి ఆటకు అంతరాయం కలిగించకపోతే టీమిండియా విజయం సాధించడం ఖాయమే.

strong>

కుర్రాళ్ల భవిష్యత్తుకే మంచిది కాదు.. ఐసీసీ, బీసీసీఐ చర్యలు తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్టార్క్.. రెండో స్థానానికి పడిపోయిన బుమ్రా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy