Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీ వర్షం

భారీ వర్షం

నక్కపల్లి, గొలుగొండ మండలాల్లో కుండపోత

వరినాట్లుకు మేలు చేస్తుందని రైతుల ఆశాభావం

------

క్కపల్లి, పాయకరావుపేట, గొలుగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురిసింది.

వరినాట్లుకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

----

నక్కపల్లి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మెరక గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉద్దండపురం, గుల్లిపాడు, రమణయ్యపేట, రేబాక, ముకుందరాజుపేట, జ.జగన్నాఽథపురం, గొడిచెర్ల, చినదొడ్డిగల్లు, వేంపాడు తదితర గ్రామాల్లో సుమారు గంటన్నరపాటు కుండపోతగా వాన పడింది. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతంగా కాసింది. తరువాత ఆకాశం మేఘావృతమై భారీ వర్షం పడడంతో వాతావరణ ం చల్లబడింది. ఇటీవల వేసిన వరినాట్లుకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.

గొలుగొండ మండలంలో..

కృష్ణాదేవిపేట, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్‌.నాగాపురం, లింగంపేట, గింజర్తి, చోద్యం, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. వరినాట్లు, నారుమడులు, పత్తి, మిరప పంటలకు వర్షం ఊరటనిచ్చింది.

పాయకరావుపేట మండలంలో..

పాయకరావుపేట, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సుమారు 30 నిమిషాలపటు పడిన వర్షంతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ప్రజలు ఊపశనమం చెందారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy