పెద్దపల్లి: గోదావరిఖని ఇందిరానగర్‌కు చెందిన లారీ డ్రైవర్ రవీందర్ కిరోసిన్ బాటిల్‌తో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొద్ది రోజులుగా భార్య కాపురానికి రాకపోగా పోలీసులకు రవీందర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో మనస్థాపం చెందిన రవీందర్.. పెట్రోల్ బాటిల్‌తో వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేశాడు. వన్ టౌన్ సీఐ రమేశ్ బాబు అక్కడికి చేరుకుని రవీందర్‌ను వాటర్ ట్యాంక్‌పై నుంచి కిందకి దించారు. రవీందర్ భార్యను పిలిపించి రాజీ కుదిర్చారు.

