ఇంటర్నెట్ డెస్క్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న శ్రీనివాస్.. ఓ ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అని... ఆయన నుంచి ఇంతకంటే ఎక్కువ ఏమి ఆశిస్తామని పవన్ అన్నారు. వారి దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని... దాడులు చేస్తే చూస్తూ కూర్చోమని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ వీడియో ప్రకటన విడుదల చేసిన పవన్.. వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలను కట్టడి చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. లేదంటే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించేంత సంయమనం తమ దగ్గర లేదన్నారు.
దళితలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు అక్రమంగా బనాయిస్తే... మానవహక్కుల సంఘానికి తాను స్వయంగ వెళ్లి ఫిర్యాదు చేస్తానన్నారు. దళితులను రక్షించాల్సిన చట్టాన్నే దళితులపై ప్రయోగిస్తున్నారన్నారు.
వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్న... వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాటలను... జనసేన శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు. ''వీధిలో కొన్ని కుక్కలు అరుస్తాయి... కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన ఆ కుక్కను మనం కరవం కదా. మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేస్తాం. వచ్చే వరకు ఆగుతాం. మీకు మాటిస్తున్నాను. మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది... అప్పటి వరకు సంయమనం పాటించండి'' అని పవన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పవన్‌పై భీమవరం ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

