Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూ ఆక్రమణలపై ఉక్కుపాదం: మంత్రి అవంతి

భూ ఆక్రమణలపై ఉక్కుపాదం: మంత్రి అవంతి

విశాఖ: భూ ఆక్రమణలపై ప్రభుత్వ ఉక్కుపాదం మోపుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖరీదైన భూమి కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తే కక్ష సాధింపు అంటారా? అని నిలదీశారు. టీడీపీ బండారం బట్టబయలు అయిందన్నారు. పల్లా శ్రీనివాస్ కుటుంబం ఆధీనంలో భూములు ఉన్నాయని తేలిందన్నారు. ఇంకా సినిమా అయిపోలేదు.. మున్ముందు ఇంకా ఉందని హెచ్చరించారు. సీఎం జగన్ మాటలు ఎంపీ విజయసాయిరెడ్డి వింటే.. విజయసాయి మాటలు మంత్రులు, ఎమ్మెల్యేలు వింటారని చెప్పారు. వారి అనుచరులకు చంద్రబాబు బుద్ధి చెప్పుకోవాలని మంత్రి అవంతి హితవు పలికారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy