అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా యర్రజెర్ల, మర్లపాడు, కొణిజేడు, సర్వేరెడ్డిపాలెం తదితర గ్రామాల భూములను ఇళ్ల స్థలాలకు పంపిణీని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ ఎం.గంగారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు ఇవ్వజూపిన భూమిలో పశువుల్ని మేపుకుంటున్నారని, ఆ భూమిని ఇళ్ల స్థలాలకు ఇస్తే వారంతా తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల న్యాయవాది వివరించారు. అందువల్ల ఇళ్లపట్టాల పంపిణీపై స్టే విధించాలని అభ్యర్థించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ..
