Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఆర్‌ఎస్‌ పార్టీకి పరాభవం తప్పదు

బీఆర్‌ఎస్‌ పార్టీకి పరాభవం తప్పదు

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లే బీఆర్‌ఎస్‌ పార్టీకి పరాభావం తప్పదని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

సోమవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం లో ఆయన విలేకరులతో శ్రీనివాస్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మూడు సంవత్సరాల(వేయి రోజులు)పాలనలో మేనిఫెస్టోలో ప్రకటిం చిన పథకాలతోపాటు ప్రకటించని పథకాలను కూడా అమలుచేసి రాష్ట్రాన్ని అభి వృద్ధి పథంలోకి తీసుకెళ్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్లోకి వెళ్లే నైతికత కోల్పోవడంతోనే ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సీట్లు గల్లంతయ్యాయని నాయకులు మరిచారన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని మున్సిపల్‌, గ్రామ పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీనే ప్రజల ఆదరించారని బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీకి తెలంగాణలో చోటు లేదని తీర్పునిచ్చారని అన్నారు. 2014లో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు 70శాతం కూడా అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ముఖ్య మంత్రిగా దళితుడిని చేస్తామని, దళితులకు మూడు ఒకరాల భూమి ఇస్తామని, అర్హులైన పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌రూంలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, ఉపాధ్యక్షుడు బొప్ప దేవరాజు, కార్యదర్శి నీలి రవీందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల దామోదర్‌, కార్యదర్శి చొక్కాల రాము, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాల రాజు, మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ ఆడెపు చంద్రకళ, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌, కౌన్సిలర్లు కూర శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, వెంగళ లీలా, బొద్దుల శ్రీనివాస్‌, నాయకులు కంసాల మల్లేశం, లక్ష్మన్‌, మల్లయ్య పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy