నేడు, రేపు వెబ్ ఆప్షన్లు
వరంగల్ అర్బన్, జనవరి 21: బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్‌అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. ఈ నెల 22, 23 తేదీలలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 22న సాయంత్రం 5 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ ఠీఠీఠీ.జుుఽటఠజిట.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ చూడాలని వర్సిటీ అధికారులు సూచించారు.
