Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిహార్‌లో దారుణం.. అత్యాచార బాధితురాలిని మేడపై నుంచి తోసేసిన దుండగులు

బిహార్‌లో దారుణం.. అత్యాచార బాధితురాలిని మేడపై నుంచి తోసేసిన దుండగులు

లఖ్‌నవూ: బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల క్రితం ఐదుగురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన 30 ఏళ్ల మహిళపై మరోసారి దాడికి పాల్పడ్డారు దుండగులు.

ఇద్దరు వ్యక్తులు ఆమెను భవనం పైకి తీసుకెళ్లి కిందకు తోసేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి సుమారు 12-15 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అనంతరం నగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. జూన్‌లో నమోదైన సామూహిక అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై నిందితులు ఒత్తిడి తెస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని, రాజీకి రావాలని ఒత్తిడి చేశారని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు.

బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు నిందితులపై పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భోంగల్ కుమార్ అలియాస్ భోంగల్ మహతోను అరెస్టు చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఐదు నెలల క్రితం సామూహిక అత్యాచారం..

జూన్‌లో రాత్రి 11.30 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. శబ్ధం విని బయటకు వచ్చిన ఆమె భర్తను నిందితులు గదిలో బంధించారు. అనంతరం మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళపై అత్యంత కిరాతకంగా దాడి చేసి ఇంటి సమీపంలో వదిలివెళ్లారు.

వైద్య పరీక్షల సమయంలో బాధితురాలి మర్మాంగాల నుంచి రాళ్లు, చెక్క ముక్కతో పాటు క్యాట్రిడ్జ్‌ను పోలిన వస్తువును వైద్యులు బయటకు తీశారు. ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఐదో నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదైన మూడు నెలల తర్వాత కొందరు వ్యక్తులు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి మరోసారి దాడికి ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపైనా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తమ ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడం లేదని.. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

బిహార్ ప్రభుత్వంపై తేజస్వీ యాదవ్ ఆగ్రహం..

ఈ ఘటనపై బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ఇప్పటికే సామూహిక అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేసిన మహిళపై పదేపదే బెదిరింపులు, దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఫరీదాబాద్ కాల్పుల కేసు.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్

సూపర్‌ పీఎం అయ్యేందుకే సోనియా త్యాగం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy