Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ ఆ చట్టం తెస్తే... రాజకీయాలకు గుడ్ బై చెబుతా : అభిషేక్ బెనర్జీ

బీజేపీ ఆ చట్టం తెస్తే... రాజకీయాలకు గుడ్ బై చెబుతా : అభిషేక్ బెనర్జీ

కోల్‌కతా : కుటుంబంలో ఎవరైనా ఒకరే రాజకీయాల్లోకి రావాలన్న చట్టం చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు. ఈ చట్టాన్ని బీజేపీ తెస్తే తాను తక్షణమే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువైతే బహిరంగ ఉరికి తాను సిద్ధమేనని అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాజ్‌నాథ్, సుబేందు, ముకుల్ రాయ్, కైలాస్ విజయ వర్గీయ... వీరి కుటుంబ సభ్యులందరూ బీజేపీలో ప్రముఖమైన పదవుల్లోనే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ''కుటుంబం నుంచి ఎవరైనా ఒక్కరే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని కేంద్రం చట్టం తెస్తే... తమ కుటుంబం నుంచి మమతా బెనర్జీ ఒక్కరే రాజకీయాల్లో ఉంటారని, ఆ మేరకు తాను హామీ ఇస్తున్నానని అభిషేక్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy