Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బీజేపీ నుంచి వెలగపూడి గోపాలకృష్ణ సస్పెన్షన్‌

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): బీజేపీ నుంచి వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌ను సస్పెండ్‌ చేశారు. శనివారం మందడంలో రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన రాజధానికి భూములిచ్చిన రైతులకు తమ పార్టీ అండగా ఉండలేకపోతోందంటూ చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అఽధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశారు. కాగా, అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్‌ఎం) రాష్ట్ర అధ్యక్షుడిగా వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌ నియమితులయ్యారు. మరోవైపు సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా సోమవారం బాధ్యతలు చేపడతారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy