Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి అప్రజాస్వామికం

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి అప్రజాస్వామికం

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు దాడులు చేయడం అప్రజాస్వామి కమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.

బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని అంబే ద్కర్‌ చౌరస్తాలో రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహ నం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దిష్టిబొమ్మను లాగేం దుకు పోలీసులు యత్నించినా నాయకులు అడ్డుకుని పూర్తిగా దహనం చేశారు. అనం తరం అంబేద్కర్‌ విగ్రహం ఎదుట బైఠాయించిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు చేయడం అత్యంత అప్రజాస్వామిక చర్య అని తీవ్రంగా ఖండించారు. దాడులు జరుగుతున్న సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులుఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శులు శ్రీమతి కర్నె హరీష్‌, మీసా సంజీవ్‌, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కిరణ్‌ నాయక్‌, జిల్లా ధార్మిక సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, వేములవాడ అర్బన్‌ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్‌గౌడ్‌, గంభీరా వుపేట మండల అధ్యక్షుడు కోడె రమేష్‌, కథలాపూర్‌ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం, కోనరావుపేట మండ ల అధ్యక్షుడు మీరాల్‌కార్‌ బాలాజీ, చందుర్తి మండల అధ్యక్షుడు మోకిలే విజయేం దర్‌, రుద్రంగి మండల అధ్యక్షుడు కర్ణ బత్తుల వేణుగోపాల్‌, వేములవాడ రూరల్‌ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేష్‌, ముస్తాబాద్‌ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, వేములవాడ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy