హైదరాబాద్: దేశంలో బీజేపీకి ఎన్నికలు తప్ప.. కరోనా ఇబ్బందులు పట్టడం లేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఇబ్బందులు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల రోడ్ షోలు రద్దు చేసుకున్నారని చెప్పారు. కరోనా విజృంభిస్తుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేలా పెట్టాల్సిన అవసరం ఉందా అని హనుమంతరావు ప్రశ్నించారు. కుంభమేళా పెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం తీరత్‌సింగ్ రావత్‌పై చీఫ్ జస్టిస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు అధికార అహం ఎక్కువైందని మండిపడ్డారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు 6 వేలు ఇవ్వాలని హనుమంతరావు డిమాండ్ చేశారు.

