సూరత్: ఇతర పార్టీలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవడం వల్లే గత 25 ఏళ్లుగా బీజేపీ గుజరాత్‌ను ఏలుతూ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశంలో బీజేపీని సవాలు చేయగలిగిన పార్టీ ఆప్ మాత్రమేనని అన్నారు. గుజరాత్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ న్నికల్లో ఆప్ తొలిసారిగా అడుగుపెట్టి, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)లో 27 సీట్లు గెలుచుకుంది. ఆప్ అభ్యర్థుల ఘనవిజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.
ఆప్‌కు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను ఉద్దేశించి ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ గొప్పగా చేసిందేమీ లేదని, ఎన్నో సమస్యలు ఉన్నాయని అన్నారు.

