Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీసీసీఐ ప్లాన్ అదేనా.. కౌంటీ క్రికెట్‌లో ఆకిబ్ నబీకి ఛాన్స్!

బీసీసీఐ ప్లాన్ అదేనా.. కౌంటీ క్రికెట్‌లో ఆకిబ్ నబీకి ఛాన్స్!

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ పేసర్‌ ఆకిబ్‌ నబీకి ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం కల్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. భారత్‌ తదుపరి న్యూజిలాండ్‌ టెస్టు పర్యటనను దృష్టిలో పెట్టుకుని..

ఇంగ్లండ్‌లోని కొన్ని కౌంటీ జట్లతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ చివరి దశలో కనీసం రెండు, మూడు రెడ్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడేలా నబీకి స్వల్పకాలిక కాంట్రాక్ట్‌ ఇప్పించాలని బోర్డు భావిస్తోంది.

గత రంజీ సీజన్‌లో అత్యధికంగా 60 వికెట్లు తీసిన నబీ.. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో మాత్రం తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరో యువ పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంది. మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణకు వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విశ్రాంతి లభించడంతో.. గుర్నూర్‌ బ్రార్‌ నవంబర్‌ 30 నుంచి సౌత్‌ జోన్‌తో జరగనున్న దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్‌ కోసం నార్త్‌ జోన్‌ జట్టుతో చేరనున్నాడు. ఈ క్రమంలో ఆకిబ్‌కు కూడా ఇంగ్లండ్‌లో కనీసం రెండు, మూడు రెడ్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది.

సర్రేతో చర్చలు?

ఇంగ్లండ్‌లోని ప్రముఖ కౌంటీ జట్టు సర్రేకు ప్రస్తుతం స్వింగ్‌ బౌలర్‌ అవసరమని తెలుస్తోంది. దీంతో ఆకిబ్‌ నబీని కొన్ని మ్యాచ్‌లకు ఆడించే అంశంపై సర్రేతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సర్రే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీవర్ట్‌.. ఈ విషయంపై బీసీసీఐకి సంబంధించిన వ్యక్తులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

'న్యూజిలాండ్‌ పిచ్ పరిస్థితులు ఇంగ్లండ్‌తో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ ఆకిబ్‌ భవిష్యత్తు ప్రణాళికల్లో కచ్చితంగా ఉంటాడు. ఇంగ్లండ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడటం అతడికి మంచిదే. గుర్నూర్‌ దులీప్‌ ట్రోఫీ ఆడుతున్న సమయంలో ఆకిబ్‌కు ఈ అవకాశం కల్పించాలనుకుంటున్నాం. ప్రస్తుతం అతడి యూకే వీసా కోసం బీసీసీఐ ప్రయత్నిస్తోంది. వీసా వచ్చిన వెంటనే అతడు ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం ఉంది' అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

strong>

టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!

అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy