Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

హైదరాబాద్, మే 19: నగరంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం తాగించి బీటెక్ చదువుతున్న యువతిపై తోటి విద్యార్థి అత్యాచారం చేశాడు.

దీంతో బాధితురాలు ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉడుతల విజయ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్.. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

మే 14వ తేదీన తనతోపాటు చదువుతున్న యువతిని టీ తాగుదామని ఆహ్వానించాడు. ఇద్దరు కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లారు. టీ తాగిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉడుతల విజయ్ మద్యం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బీడీఎస్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి కారులో ఆ యువతిని తీసుకెళ్లాడు. విద్యార్థినితో అతడు మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఉడుతల ఉదయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy