Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిట్‌కాయిన్ భారీ పతనం... .

బిట్‌కాయిన్ భారీ పతనం... .

ముంబై : క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ విలువ భారీగా పతనమవుతోంది. కేవలం ఒక్క వారంలోనే... ఏకంగా 51 వేల డాలర్లకు పడిపోయింది. భారత కరెన్సీలో రూ. 8 లక్షలు క్షీణించి రూ. 41.24 లక్షలకు దిగిపోయింది. క్రిప్టోకరెన్సీలో రాజుగా ఉన్న బిట్ కాయిన్ గత వారం ఆల్ టైమ్ గరిష్టం రూ. 64,829.14 డాలర్లకు(రూ. 48.46 లక్షలు) చేరుకుంది. కాగా ఇప్పుడు మాత్రం ఇది 53,705.54 డాలర్లకు(సుమారు రూ. 41 లక్షలు) పతనమైంది. గత అయిదు సెషన్‌లలో క్రిప్టోకరెన్సీ విలువ లక్షల్లో పడిపోవడం గమనార్హం.

బిట్ కాయిన్ పతనం అందుకే...

కాయిన్‌డెస్క్ ప్రకారం ఉదయం 11 గంటల సమయానికి బిట్ కాయిన్ 54,978.74 డాలర్ల(రూ. 41.10) వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలు ఇటీవల పతనమవుతున్న విషయం తెలిసిందే.

కాగా... ఇందుకు పలు కారణలున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు క్రిప్టోకరెన్సీని ఉపయోగించడంపై అమెరికా అధికారుల కఠిన చర్యలు, క్రిప్టో కరెన్సీని, క్రిప్టో ఆస్తులను కొనుగోలు చేయడంపై టర్కీ సెంట్రల్ బ్యాంకు నిషేధం విధించినట్లు వార్తలు వచ్చిన తర్వాత బిట్ కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలు క్షీణించాయి.

చైనా నిర్ణయం...

ప్రస్తుత పరిస్థితులకణుగుణంగా ఇంధనం జోడించడంపై చైనా తీసుకున్న యూటర్న్ బిట్ కాయిన్‌కు షాక్ తగిలిగిందని భావిస్తున్నారు. ఇంధనాన్ని ఇప్పుడు బిట్ కాయిన్‌కు ప్రత్యామ్నాయ పెట్టుబడిగా పిలుస్తున్నారు. ఈ ప్రభావం బిట్ కాయిన్ పై తారస్థాయిలోనేపడింది. ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఎప్పుడైనా అస్థిరతకు గురి కావొచ్చునని చెబుతున్నారు.

ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా పతనం...

బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా పతనమయ్యాయి. ఎథేరియం, ఎక్స్ఆర్పీ, స్టెల్లార్ పడిపోయాయి. మధ్యాహ్నం సమయానికి ఎథేరియం 2,123.13 డాలర్లకు, ఎక్స్‌ఆర్పీ 1.28 డాలర్లకు, స్టెల్లార్ 0.488306 డాలర్లకు క్షీణించింది. కేవలం డోజీకాయిన్ మాత్రమే లాభపడింది. ఇది 22.63 శాతం లాభపడడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy