గాంధీనగర్: కరోనా నుంచి కోలుకున్న అనేక మంది బాధితులను మ్యూకోర్మిసిన్ ఫంగస్ బాధిస్తోంది. బ్లాక్ ఫంగస్‌గా పిలిచే ఈ ఫంగి వల్ల ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేకమంది అంధులుగా మారుతున్నారు. ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎంతో మంది బాధితులు ఈ ఫంగి బారిన పడినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక మెడికల్ వార్డులను ఏర్పాటు చేస్తోంది. అలాగే బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్ కోసం కావలసిన యాంటీ-ఫంగల్ ఔషధాలను దాదాపు 5వేల వయల్స్‌ను దిగుమతి చేసుకుంది. ఇప్పటివరకు గుజరాత్‌లోనే దాదాపు 100 మంది ఈ ఫంగి బారిన పడినట్లు తెలుస్తోంది.
వీరిలో 19 మంది అహ్మదాబాద్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

