Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌: గుత్తా

బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌: గుత్తా

నల్లగొండ: భారతీయ జనతాపార్టీకి తెలంగాణ విలీన దినోత్సవానికి సంబంధం ఏమిటని శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు.

సెప్టెంబరు 17ను బీజేపీ ఒక ఆటవస్తువులాగా ఆడుకుంటోందని, తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్నారు. 1951లో జనసంఘ్‌ ప్రారంభమైందని, 1980లో బీజేపీ ఆవిర్భవించిందన్నారు. బ్లాక్‌ మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన రేవంత్‌రెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌, సంజయ్‌లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని, ఆ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ దోపిడీకి గురవుతుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.

దుర్బుద్ధితోనే కొత్త పార్టీలు: శాసన మండలి చైర్మన్ గుత్తా కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులా..: రేవంత్‌రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy