Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బొల్లారం డిటోనేటర్ల ఘటనపై డీసీపీ క్లారిటీ.. ఆర్మీ ప్రాంతంలో దొరకలేదు

బొల్లారం డిటోనేటర్ల ఘటనపై డీసీపీ క్లారిటీ.. ఆర్మీ ప్రాంతంలో దొరకలేదు

హైదరాబాద్, సెప్టెంబర్ 3: హైదరాబాద్‌ బొల్లారంలో డిటోనేటర్లు లభించిన ఘటనపై మల్కాజ్‌గిరి డీసీపీ శ్రీధర్‌ కీలక వివరాలు వెల్లడించారు. 160 డిటోనేటర్లు ఆర్మీ ప్రాంతంలో లభించలేదని..

అవి ఓ ప్రైవేట్‌ వెంచర్‌లో గుర్తించినట్లు స్పష్టం చేశారు. ఈ డిటోనేటర్లు ఆర్మీకి చెందిన ఆస్తులు కావని డీసీపీ తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించినట్లు వెల్లడించారు. ఆ డిటోనేటర్లను గతంలో ప్రైవేట్‌ వెంచర్‌ డెవలపర్లు అక్కడ ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై అనవసరమైన అపోహలు.. ఆందోళనలు వద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

డిటోనేటర్లు లభించిన వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీసీపీ శ్రీధర్‌ తెలిపారు. వాటిని అక్కడ ఎవరు ఉపయోగించారు, ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాయి, ఏ అవసరం కోసం వినియోగించారనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఆర్మీకి సంబంధించిన ఘటనతో ఈ డిటోనేటర్లకు ఎలాంటి సంబంధం లేదని డీసీపీ స్పష్టం చేశారు. ఆర్మీ కేసు, ప్రైవేట్‌ వెంచర్‌లో డిటోనేటర్లు లభించిన ఘటన రెండూ వేర్వేరు అంశాలని తెలిపారు. ఆర్మీకి సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. అందులో ఏవైనా తదుపరి పరిణామాలు చోటుచేసుకుంటే అధికారికంగా వెల్లడిస్తామని డీసీపీ శ్రీధర్‌ స్పష్టం చేశారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy