Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

మరావతి, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా ఆయన పోస్టు పెట్టారు. అద్భుతమైన సంయమనం, కచ్చితత్వం, పట్టుదలతో, ధీరజ్ ఉత్కంఠభరితమైన షూట్-ఆఫ్‌లో జపాన్‌కు చెందిన జున్యా నకానిషిని ఓడించి, పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ప్రశంసించారు. తద్వారా ప్రపంచ కప్ ఫైనల్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారతీయ పురుష రికర్వ్ ఆర్చర్‌గా నిలిచారని పేర్కొన్నారు.

అతని ప్రయాణం, అంకితభావం ప్రత్యేకంగా స్ఫూర్తిదాయకమని డిప్యూటీ సీఎం కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ధీరజ్, చిన్న వయసులోనే తన ఆర్చరీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ప్రత్యేకంగా ఎగురవేస్తూ ఈ క్రీడలో శిఖరాగ్రానికి చేరుకున్నారని అభివర్ణించారు. ఇది భారత ఆర్చరీ చరిత్రలో ఒక మైలురాయని.. మన క్రీడాకారుల ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని ఉద్ఘాటించారు. బొమ్మదేవర భారత్‌కు గర్వకారణంగా నిలిచారని తెలిపారు భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

భారత మహిళల క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

డీపీ వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా ఆయన పోస్టు పెట్టారు. నైపుణ్యం, సంయమనం, పట్టుదలకు ఇది ఒక చక్కటి ప్రదర్శన అని వ్యాఖ్యానించారు. ఈ విజయం భారత క్రికెట్‌కు మరో గర్వకారణమని పేర్కొన్నారు. భారత మహిళలకు ఓ అద్భుతమైన ఘనత అని పవన్ కల్యాణ్ తెలిపారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy