స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల ఐపీఎల్ 2026 ముగిసింది. దీంతో టీమిండియా దృష్టి ఇప్పుడు అంతర్జాతీయ క్యాలెండర్‌పైకి మళ్లింది. భారత జట్టు అఫ్గనిస్థాన్‌తో మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో తలపడనుంది.
ఈ సిరీస్‌తో దాదాపు ఆరు నెలల తర్వాత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత జట్టు తరఫున పునరాగమనం చేయనున్నారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ వీడియోలో రోహిత్ శర్మ నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోయి నేలపై బోర్లా పడ్డాడు. ఈ వీడియో ఇప్పటిదా లేక పాతదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. అయినప్పటికీ రోహిత్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో తమ అభిమాన ఆటగాడు అఫ్గనిస్థాన్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ఐపీఎల్ 2026లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే ఆడిన మ్యాచ్‌ల్లో మాత్రం తనదైన క్లాస్‌ను ప్రదర్శించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
రోహిత్, విరాట్ 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా అంతర్జాతీయ వన్డేల్లో కొనసాగుతున్నారు. ఆ సమయం వరకు ఫామ్‌లో ఉండి, ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఉంటేనే జట్టులో ఉంటారని సెలెక్టర్లకు వారిద్దరికి స్పష్టం చేశారు. ఈ మేరకే రో-కో అడుగులు వేస్తున్నారు. అఫ్గనిస్థాన్, భారత్ మధ్య వన్డే మ్యాచ్‌లు ఈనెల 13, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి.

