Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రిక్స్ వేదికగా ముగిసిన మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ..

బ్రిక్స్ వేదికగా ముగిసిన మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ..

ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ ముగిసింది. బ్రిక్స్ (BRICS) సదస్సు వేదికగా ఇరుదేశాల అగ్రనేతలు కీలక అంశాలపై చర్చించారు.

ముఖ్యంగా సరిహద్దు ఒప్పందాలు, వాణిజ్యం, పర్యాటకం, వ్యాపారం, సాంస్కృతిక బదిలీ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా సరిహద్దు ఒప్పందాలను ఇరు దేశాలు తప్పనిసరిగా గౌరవించాలని భారత ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో శాంతి, భద్రతలే ద్వైపాక్షిక సంబంధాలకు పునాది అని ఆయన స్పష్టం చేశారు.

సరిహద్దు వివాదాలకు న్యాయబద్ధమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రెండు దేశాలూ కట్టుబడి ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాలే మార్గదర్శకంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చైనా, భారత్ మధ్య విభేదాలు వివాదాలుగా మారకూడదని జిన్‌పింగ్, మోదీ పేర్కొన్నారు. అనంతరం రెండు దేశాల మధ్య భారీ వాణిజ్య లోటు, సరఫరా సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్లలో సరైన ప్రవేశం కల్పించాలని మోదీ కోరారు. దీంతో వ్యాపారం, పర్యాటకం, సాంస్కృతిక బదిలీలకు ఊతమివ్వాలని ద్వైపాక్షిక భేటీలో నిర్ణయించారు. కాగా, బ్రిక్స్ సదస్సు విజయవంతానికి సహకరించిన చైనాకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy