Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రో.. కాస్త ఆగు: రాహుల్‌కు కంగనా రనౌత్ కౌంటర్

బ్రో.. కాస్త ఆగు: రాహుల్‌కు కంగనా రనౌత్ కౌంటర్

ఇంటర్నెట్ డెస్క్: నటి కృతి సనన్ వివాదంలో 'పితృస్వామ్యాన్ని కూల్చేయండి' అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అధికారిక ఖాతాలో పోస్ట్ అయిన కొన్ని చిత్రాలను ఆమె రీషేర్ చేశారు.

మహిళా రిజర్వేషన్, ట్రిపుల్ తలాక్ విషయాల్లో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ ఈ చిత్రాలను బీజేపీ పోస్ట్ చేసింది.

ఓ చిత్రంలో రాహుల్ గాంధీ 'పితృస్వామ్యాన్ని కూల్చేయండి' అని చెబుతారు. దానికి ఓ మహిళ 'మరి ట్రిపుల్ తలాక్ సంగతేంటి?' అని ప్రశ్నిస్తుంది. దానికి రాహుల్ 'అది ఓట్ బ్యాంకు కోసంలే.. కానీ పితృస్వామ్యాన్ని కూల్చేయండి' అని బదులిస్తారు. ఇంకో చిత్రంలో రాహుల్ మళ్లీ 'పితృస్వామ్యాన్ని కూల్చేయండి' అని చెబుతారు.

అప్పుడు చిత్రంలోని మహిళ 'మీ పార్టీ మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసింది కదా' అని ఎద్దేవా చేస్తారు. దానికి రాహుల్ 'అది కూడా ఓట్ గేమే.. అయినా ఆ పితృస్వామ్యాన్ని కూల్చేయండి' అంటూ సమాధానమిస్తారు.. ఇలా మహిళలకు మేలు జరిగే పలు విషయాల్లో కాంగ్రెస్ అడ్డుపడిందని అర్థం వచ్చేలా బీజేపీ పోస్ట్ పెట్టింది.

ఈ చిత్రాలను కంగన షేర్ చేసి, 'బ్రో కాస్త ఆగు.. భారత్ మాతాకీ జై' అని క్యాప్షన్ పెట్టారు. రాహుల్ గాంధీ మహిళల పక్షాన ఎప్పుడూ నిలబడలేదని ఆమె పరోక్షంగా విమర్శించారు.

strong>

కోటంరెడ్డి జెన్‌జీ యువతతో సమావేశాలు నిర్వహించడం అభినందనీయం: మంత్రి లోకేశ్

రెడ్ కార్పెట్‌తో ఘనస్వాగతం.. సిగ్గుపడిన టెన్నిస్ దిగ్గజం ఫెదరర్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy