ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ప్రపంచ నంబర్-5గా ఉన్న సాత్విక్-చిరాగ్ 36 నిమిషాల్లో 18-21, 9-21 తేడాతో పరాజయం చవి చూశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆశించిన స్థాయిలో పదును చూపలేకపోయిన భారత జోడీ.. రెండో గేమ్‌లో పూర్తిగా వెనుకబడింది.
2022, 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించిన సాత్విక్-చిరాగ్.. ఈసారి మూడో పతకంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలైన లియాంగ్-వాంగ్ జోడీ ముందు భారత జంటకు ఎదురుదెబ్బ తగిలింది.
strong>
కుల్‌దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
ఒక్క మ్యాచ్‌తో కుల్‌దీప్ సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: స్పిన్ కోచ్ బహుతులే

