Dailyhunt
బ్యాటింగ్‌లో కోహ్లీకి సవాల్ విసిరేది ఎవరో తెలుసా.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

బ్యాటింగ్‌లో కోహ్లీకి సవాల్ విసిరేది ఎవరో తెలుసా.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్కంఠగా కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సీజన్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఓ అరుదైన మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే 9వేల పరుగుల ఫీట్‌ను అందుకున్న తొలి ప్లేయర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

'కోహ్లీకి సవాల్ విసరగలిగే ప్లేయర్ ఎవరో తెలుసా.. విరాట్ కోహ్లీనే! ఈ ప్రపంచంలో అతడిని బీట్ చేసే ప్లేయర్ ఇంకా పుట్టలేదు. ఐపీఎల్‌లో 9000 పరుగులు మౌంట్ ఎవరెస్ట్ లాంటి మైలురాయి. కానీ అతడికి అది అతడి కెరీర్‌లో ఒక మెట్టు మాత్రమే.. గమ్యం కాదు. క్రికెట్‌లో అతడు ఇంకా చేయాల్సిన పనులు, అందుకోవాల్సిన రికార్డులు చాలా ఉన్నాయి' అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం కోహ్లీ 19 ఐపీఎల్ సీజన్లలో 275 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 9వేలకు పైగా పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కూడా అద్భుత ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ రేసులో పోటీ పడుతున్నాడు. ఇక ఆర్సీబీ జట్టు కూడా ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy