Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

నెల్లూరు, సెప్టెంబర్ 15: జిల్లాలో వైపీపీ రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. వైసీపీ యువజన విభాగం రూరల్ అధ్యక్షుడు నీరపరెడ్డి ప్రవీణ్ రెడ్డి అలియాస్ టింకు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగాడు.

కొత్తూరు ప్రాంతంలో కొందరు యువకులను చంపేస్తానంటూ బెదిరిస్తూ సెటిల్మెంట్‌కు దిగగా.. దీనికి సంబంధించి ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా కాలంగా టింకు.. పలువురు రౌడీషీటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో లేడీ డాన్స్ అరుణ, ఆరవ కామాక్షి ఉదంతాలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడగా.. తాజాగా టింకు బెదిరింపు ఆడియోలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చంపేస్తామని బెదిరించి గతంలో పార్టీ కార్యక్రమాలకు జనసమీకరణ చేసినట్లు టింకుపై ఆరోపణలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పక మునుపే, రౌడీ మూకలపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy