Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చమురు సలసల.. మార్కెట్‌ విలవిల

చమురు సలసల.. మార్కెట్‌ విలవిల

సెన్సెక్స్‌ 1,124 పాయింట్లు పతనం నిఫ్టీ 360 పాయింట్లు డౌన్‌ 22,800 దిగువకు చేరిక

  • దాదాపు 6 నెలల కనిష్ఠానికి సూచీలు

  • రూ.7.53 లక్షల కోట్ల సంపద ఆవిరి

  • భారీగా తగ్గిన రూపాయి, బంగారం, వెండి

  • మళ్లీ 110 డాలర్ల దిశగా బ్రెంట్‌ క్రూడాయిల్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1,124.04 పాయింట్లు (1.52 శాతం) పతనమై 72,771.72 వద్దకు జారుకుంది. నిఫ్టీ 360.25 పాయింట్లు (1.56 శాతం) క్షీణించి 22,780.25 వద్దకు పడిపోయింది. సూచీలకిది దాదాపు ఆరు నెలల (మార్చి 30 తర్వాత) కనిష్ఠ స్థాయి. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.7.53 లక్షల కోట్లు తగ్గి రూ.474.36 లక్షల కోట్లకు (4.94 లక్షల కోట్ల డాలర్లు) పరిమితమైంది.

  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో ఇన్ఫీ మినహా అన్నీ నష్టపోయాయి. ఎల్‌ అండ్‌ టీ షేరు 2.81 శాతం క్షీణించి సూచీ టాప్‌లూజర్‌గా మిగిలింది. మార్కెట్‌ దిగ్గజాలైన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతోపాటు ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు కూడా 2 శాతానికి పైగా నష్టపోయాయి.

  • బీఎస్ఈలోని స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 1.90 శాతం, మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 1.39 శాతం తగ్గాయి. రంగాలవారీ సూచీలన్నీ నష్టపోగా.. పీఎ్‌సయూ బ్యాంక్‌ అత్యధికంగా 3.25 శాతం క్షీణించింది. పవర్‌, టెలికాం, యుటిలిటీస్‌, ఇండస్ట్రియల్స్‌, మిడ్‌స్మాల్‌ ప్రైవేట్‌ బ్యాంక్స్‌ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పతనమయ్యాయి.

  • విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ పీ ఐ) రూ.5,353.22 కోట్ల నికర విక్రయాలు జరపగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ.5,189.02 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

  • భారత కరెన్సీ మరింత పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 28 పైసలు క్షీణించి రూ.96.03 వద్దకు చేరింది. ఈ రెండు వారాల్లో ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.96 దాటడం ఇది రెండోసారి. చివరికి 22 పైసల నష్టంతో రూ.95.97 వద్ద ముగిసింది. చమురు ధరాఘాతంతో పాటు డాలర్‌ బలపడటం, యూఎస్‌ బాండ్ల రేట్ల పెరగుదల రూపాయిని కుంగదీశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో మున్ముందు రూపాయి మరింత ఒత్తిడికి లోనుకావచ్చని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

సూచీల నష్టాలకు కారణాలివీ..

  • హోర్ముజ్‌ జలసంధి ద్వారా సరుకు రవాణా పునఃప్రారంభంపై ఇరాన్‌ ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించడంతో ముడి చమురు ధర ఒకదశలో 3.81ు పెరుగుదలతో 108 డాలర్లు దాటింది.

  • ఫెడ్‌ రేట్లు మరింత పెరగవచ్చన్న అంచనాలతో అమెరికాలో 10 ఏళ్ల బాండ్లపై వడ్డీ రేటు 5.2 శాతం పైకి చేరుకుంది.

ఐపీఓ ధర దిగువకు ఎన్‌ఎ్‌సఈ షేరు

గత వారం బీఎ్‌సఈలో నమోదైన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) షేరు తొలిసారిగా ఐపీఓ ధర రూ.1,785 దిగువకు పడిపోయింది. సోమవారం ట్రేడింగ్‌లో ఎన్‌ఎ్‌సఈ షేరు ధర 1.67 శాతం నష్టంతో రూ.1,762.70 వద్దకు జారుకుంది. దాంతో ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌ విలువ రూ.4.36 లక్షల కోట్లకు చేరుకుంది.

నెల రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఉఫ్‌

ఈ ఆగస్టు 27 నాటి ముగింపు స్థాయితో పోలిస్తే, గడిచిన నెల రోజుల్లో సెన్సెక్స్‌ 4,161.87 పాయింట్లు (5.40 శాతం), నిఫ్టీ 1,310.6 పాయింట్లు (5.44 శాతం) క్షీణించాయి. రూ.17.17 లక్షల కోట్లకు పైగా మార్కెట్‌ సంపద హరించుకుపోయింది.

బంగారం రూ.2,600 తగ్గుదల

  • వెండి రూ.5,000 డౌన్‌

దేశీయంగా విలువైన లోహాల ధరలు మరింత తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగా రం 10 గ్రాముల ధర రూ.2,600 తగ్గి రూ.1.50 లక్షలకు జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.5,000 పతనమై రూ.2.32 లక్షలకు దిగివచ్చింది. డాలర్‌ బలోపేతం, యూఎస్‌ బాండ్ల రేట్ల పెరుగుదల, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు మరింత పెంచవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు భారీగా తగ్గడం ఇందుకు కారణంగా ఉంది. కాగా ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 129 డాలర్ల (3.01 శాతం) మేర తగ్గి 4,156.44 డాలర్లకు పడిపోగా.. వెండి దాదాపు 3 శాతం తగ్గుదలతో 61.34 డాలర్ల వద్ద ట్రేడైంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy