Dailyhunt
చంద్రబాబు ఇంటికి ఇంకా రాని కర్నూలు పోలీసులు

చంద్రబాబు ఇంటికి ఇంకా రాని కర్నూలు పోలీసులు

కర్నూలు: ఎన్-440కే వైరస్‌పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు ఇంతవరకు ఆయన ఇంటికి రాలేదు. అయితే ఇప్పటికే ఒక టీమ్ కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్‌లో మకాం వేసిందనే వార్తలొస్తున్నాయి. మరోవైపు పోలీసులు డీజీపీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇంకా ఎలాంటి ఆదేశాలు రానందునే తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. ఇక చంద్రబాబు ఇంటివద్ద అయితే సెక్యూరిటీ సిబ్బందికి కోవిడ్ వచ్చిందని, అందువల్ల ఎవరినీ లోపలికి రానివ్వరని, ఒకవేళ కర్నూలు పోలీసులు వచ్చినా ఇంటికి నోటీసులు అంటించి వెళ్లాల్సిందేనని తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు కేసు విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదు.

కోవిడ్ కర్ఫ్యూపై మాట్లాడిన డీజీపీ చంద్రబాబు కేసు విషయంపై ప్రశ్నిస్తే.. ఇప్పుడు రాజకీయాలు వద్దని, కోవిడ్ నియంత్రణే ముఖ్యమని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy